క్రైమ్/లీగల్

ఇద్దరు లష్కరే మిలిటెంట్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఫిబ్రవరి 3: పాక్‌లో శిక్షణ పొందిన ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లను భద్రతా దళాలు శనివారం అదులులోకి తీసుకున్నాయి. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఉమ్మడిగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఇద్దరు మిలిటెంట్లూ పట్టుబడినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీళ్లిద్దరూ అధికారిక పాస్‌పోర్టులతో పాక్ వెళ్లి శిక్షణ పొందినట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకుని తిరిగివస్తూ వాఘా-అత్తారీ సరిహద్దులో వీరు పట్టుబడ్డారు. అరెస్టయినవారిని క్రీరి ప్రాంతానికి చెందిన అబ్దుల్ మజీద్ భట్, పటాన్‌కు చెందిన మహ్మద్ అష్రాఫ్ మీర్‌గా గుర్తించారు. శిక్షణ పొందినవారిలో వీళ్లతోపాటు చాలామంది ఉన్నారని, వారిలో పదేళ్ల బాలుడు సైతం ఉన్నట్లు అరెస్టయిన మిలిటెంట్లు వివరించారని తెలిపారు. ఇస్లామాబాద్ సమీపంలోని బుర్మా పట్టణంలో ఉగ్రవాద శిక్షణా శిబిరం ఉన్నట్లు, అక్కడ శిబిరం నిర్వహిస్తున్న వారు మారుపేర్లతో హంజాలా, అదానన్, ఒమర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. అరెస్టయిన వారివద్ద న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్ కార్యాలయం జారీచేసిన వీసాలున్నాయని అన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.