‘తొలిప్రేమ’ విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా బాపినీడు సమర్పణలో ఎస్.వి.సి.సి బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో విడుదలైన చిత్రం ‘తొలిప్రేమ’. ఈ చిత్రానికి బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా బుధవారం సక్సెమీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ - ‘ఈ సినిమాను నమ్మి చేశాను. ఈ చిత్రానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ బాగా సెట్ అయ్యారు’ అన్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ప్రతి టెక్నీషియన్ తమ వంతుగా ఈ సినిమాకు కృషి చేశారు. వెంకీ ఒక రోజు నా ముందు కూర్చుని ఈ కథను బివిఎస్‌ఎన్ గారితో చేయడానికి సిద్ధమైనట్లు చెప్పారు. నేను సరేననుకున్నా. ఒక అసిస్టెంట్ దర్శకుడు వెయిటింగ్‌లో ఉన్నప్పుడు పడే ఆవేదన నాకు తెలుసు. ఎమోషన్స్ రిలేషన్స్ నాకూ బివిఎస్‌ఎన్ కుటుంబానికి మధ్య బాగా వున్నాయి. అందుకే ఈ సినిమా మళ్లీ నా చేతుల్లోకి వచ్చింది. కరుణాకరన్ పవన్‌కళ్యాణ్‌తో ‘తొలిప్రేమ’ను క్రియేట్ చేస్తే, ఇప్పుడు వెంకీ అట్లూరి మళ్లీ క్రియేట్ చేశారు. ‘్ఫదా’ తర్వాత వరుణ్‌తేజ్ మళ్లీ ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. మూడు పాత్రల్లో తను చూపించిన వైవిధ్యం అందర్నీ మెప్పించింది అని అన్నారు. చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ నా తొలి అటెంప్ట్‌ని ఆదరించినందుకు ధన్యవాదాలు. కెమెరామెన్ జార్చి నాకు చాల స్పెషల్. ఈ సినిమాకు చాలా కష్టపడ్డారు. రాశీని ఈ సినిమాలో చూసిన వారందరూ ఇంట్లో అమ్మాయిలా ఇష్టపడుతుండటం నాకా చాలా బాగా నచ్చింది. వరుణ్ నమ్మడం వల్లే ఈ సినిమా పురుడుబోసుకుంది అని చెప్పారు. రాశీఖన్నా మాట్లాడుతూ ఈ సినిమాకు వచ్చిన రివ్యూలన్నీ చదివాను. ట్విట్టర్‌లోనొ నన్ను వర్ష అని పిలుస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన వెంకీకి ధన్యవాదాలు. ఈ సినిమాతో నాకు ఫీమేల్ ఫ్యాన్స్ కూడా పెరిగారు. టీమ్ అంతా కష్టపడి పనిచేశాం. రిపీటెడ్ ఆడియన్స్ వచ్చి మా సినిమాను చూస్తుంటే ఆనందంగా ఉంది అని తెలిపారు. హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ఈ సినిమా కథని అందరూ నమ్మిచేశారు. అందరికన్నా ముందు దిల్‌రాజు గారు నమ్మారు. వెంకీ అట్లూరికి నేను రుణపడి ఉంటాను. వెంకీ చాలా ఇష్‌టపడి చేసుకున్న కథ ఇది. చిరంజీవి గారు సినిమా చూశాక షాక్ అయ్యారు. దర్శకుడిని మెచ్చుకున్నారు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వప్న, విద్యుల్లేఖా రమాన్, బాపినీడు, కెమెరామెన్ జార్జి, హైపర్ ఆది, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.