మల్టీస్టారర్‌లో కన్నడ హీరోయిన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, యంగ్ హీరో నానిలు కలిసి ఒక మల్టీస్టారర్ చేయనున్న సంగతి తెలిసందే. ఫిబ్రవరి 24 నుండి సెట్స్‌మీదికి వెళ్లనున్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇందులో కన్నడ స్టార్ శ్రద్ధా శ్రీనాధ్ నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. శ్రీరామ్ ఆదిత్య చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో ఆమె ఈ సినిమాపై సుముఖంగా ఉన్నారట. అయితే ఇంకా అధికారికంగా ప్రాజెక్టుమీద సైన్ చేయలేదని సమాచారం. శ్రద్ధా శ్రీనాధ్ ‘విక్రమ్ వేద’ వంటి సూపర్‌హిట్ సినిమాతో ప్రేక్షకులకి బాగా దగ్గరైన సంగతి తెలిసిందే.