చెన్నై చిన్నోడు ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా నటిస్తూ సంగీతాన్ని సమకూర్చిన ఓ తమిళ చిత్రాన్ని ‘చెన్నై చిన్నోడు’ (వీడి లవ్‌లో అన్నీ చిక్కులే ట్యాగ్‌లైన్) పేరుతో శూలిని దుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగులోకి అనువదిస్తున్నారు వి.జయంత్ కుమార్. నిక్కీ గల్రానీ, రక్షిత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.రాజేష్ దర్శకుడు. ఈ చిత్రంలోని పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- తమిళంలో సక్సెస్ అయిన చిత్రాన్ని తెలుగులో ‘చెన్నై చిన్నోడు’గా అనువదిస్తున్నారు. చిన్నతనంలోనే నిర్మాతగా మారిన జయంత్‌కుమార్‌ను అభినందిస్తూ, ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా. జి.వి.ప్రకాష్ హీరోగా నటిస్తూ మ్యూజిక్ చేశారు. పాటలు, ట్రైలర్ అద్భుతంగా ఉన్నాయి అన్నారు. నిర్మాత వి.జయంత్‌కుమార్ మాట్లాడుతూ- మా తాతగారి దగ్గరనుంచి మాకు సినిమా రంగంతో మంచి అనుబంధం ఉంది. తొలిసారిగా తమిళ చిత్రాన్ని ‘చెన్నై చిన్నోడు’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నాం. ఎక్కడా రాజీపడకుండా సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు చేయించాం. పూరణ్ పాటలన్నింటికీ సాహిత్యాన్ని సమకూర్చారు. జి.వి.ప్రకాష్ నటనతోపాటు, సంగీతాన్ని కూడా అందించారు. అతి త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్రులు ఫేం రాంకీ, సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు, గాయకులు సంపత్, సాయి మాధవ్, వౌనికారెడ్డి పాల్గొన్నారు.