నవాబ్ కోసం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదితిరావు హైదరీ మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న విషయం విదితమే. ‘చెలియా’ తర్వాత ఆమె నటిస్తున్న ఈ చిత్రంలో శింబు, అరవింద్ స్వామి, సేతుపతి, అరుణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రమిది. జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, డయానా, అదితిరావు హైదరీ హీరోయిన్లుగా, జయసుధ, ప్రకాష్‌రాజ్, త్యాగరాజన్, మన్‌సూర్ అలీఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తాజాగా ‘నవాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్‌ని చిత్రం బృందం విడుదల చేసింది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎ.ఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ‘మరోసారి మణిరత్నం దర్శకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నాకిది చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం. సరికొత్తగా ఉంటుంది’ అని అదితి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల ‘పద్మావత్’ చిత్రంలో ఆకట్టుకున్న అదితి ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు ‘దాస్ దేవ్’, ‘చెక్కా చివంత వానమ్’ చిత్రాల్లోనూ నటిస్తోంది.