ఆగస్టు నుండి హిరణ్యకశప?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్రమదేవి చిత్రం తరువాత దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించే చిత్రం ‘హిరణ్యకశప’. రానా హీరోగా నటించే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇదివరకే కథా చర్చలు జరుపుకున్న ఈ చిత్రం ఆగస్టు నుండి సెట్స్‌పైకి రానున్నదట. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రంలో హిరణ్యకశ్యపుడిగా రానా కనిపిస్తాడట. టైటిల్ కూడా హిరణ్యకశప అని పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో గుణశేఖర్ నిర్మించే ఈ చిత్రంలోని మిగతా నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో తెలియజేయనున్నారట. పౌరాణిక నేపథ్యంలో సాగే ఈ కథలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన నటీనటులు నటిస్తారని, సినిమాను కూడా మూడు భాషల్లో విడుదల చేస్తారని తెలిసింది.