స్టార్‌లతో సినిమా తీసిన ఏకైక లేడీ డైరెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ నటీమణి, దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ విజయనిర్మల నేడు తన 73వ జన్మదిన వేడుకలను ఘట్టమనేని వంశాభిమానుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘అక్కినేని నాగేశ్వరరావు, రజనీకాంత్, శివాజీగణేషన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన ఏకైక లేడీ డెరెక్టర్ విజయనిర్మల. ఆమె దర్శకత్వలో తెరకెక్కిన 44 చిత్రాల్లో సగానికి పైగా సినిమాల్లో నేను నటించినందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఏడాది ఈ విధంగా మా ఇంటికి విచ్చేసి తమ అభిమానాన్ని చాటుకొంటున్న అభిమానులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు గౌరవించిన విజయనిర్మలను త్వరలోనే భారత ప్రభుత్వం తగిన రీతిలో సత్కరిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. విజయల నిర్మల మాట్లాడుతూ.. ‘‘ఒకసారి దాసరిగారు మా ఇంటికొచ్చి నా పుట్టినరోజు వేడుకలకు అభిమానులు రావడం చూసి సంతోషించి.. ‘ఏ స్టార్ హీరోయిన్‌కీ ఈ రేంజ్ క్రేజ్ లేదు’ అన్నారు. అదే నాకు పద్మభూషణ్‌తో సమానం. నా పుట్టినరోజు వేడుకలకు హాజరైన అభిమానులందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. సీనియర్ నరేష్ మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబ సభ్యులందరి పుట్టినరోజులకు ఈ విధంగా అభిమానులు విచ్చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు. ఈ పుట్టిన రోజు వేడుకల్లో సూపర్‌స్టార్ కృష్ణ అభిమాన సంఘాల పెద్దలు, మరియు సీనియర్ ఫ్యాన్స్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియోషన్‌కు 73వేల రూపాయల విరాళాన్ని అందజేశారు.