రొమాంటిక్ థ్రిల్లర్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ దర్శకత్వంలో వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంటినేని నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరోపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌కొట్టగా, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ రామ్మోహన్‌రావు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు శ్రీవాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘కథను నమ్మి నాకు దర్శకుడిగా అవకాశమిచ్చిన నవీన్‌కు జీవితాంతం రుణపడి వుంటాను. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించి మార్చి 2నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. ఇందులో ఇద్దరు స్టార్ హీరోయిన్లు నటిస్తారు. వాళ్లెవరన్నది త్వరలోనే ప్రకటిస్తాం’ అన్నారు. హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘నవీన్‌తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఇన్నాళ్లకు కుదిరింది. తెలుగులో ఇంతవరకూ రాని కథతో ఈ చిత్రం ఉంటుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, కెమెరా: చోటా.కె. నాయుడు, ఎడిటింగ్: చోటా కె ప్రసాద్, నిర్మాణం: వంశధార క్రియేషన్స్, నిర్మాత: నవీన్ శొంటినేని, దర్శకత్వం: శ్రీనివాస్.