చిత్రలహరి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని హీరోగా నటించే చిత్రానికి చిత్రలహరి అనే టైటిల్‌ను అనుకున్నారు. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా కోసం కిశోర్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడు. కిశోర్ తిరుమల తెరకెక్కించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈ ప్రాజెక్టుపై నాని ఆసక్తి తగ్గినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వాల్సిన ఈ సినిమా కథ విషయంలో నాని సంతృప్తిగా లేడని తెలిసింది. దాంతో దర్శకుడికి చెప్పి ఈ సినిమాను చేయడంలేదని చెప్పాడట. దాంతో షాక్ అయిన దర్శకుడు అదే కథతో సాయిధరమ్‌తేజ్‌ను సెట్ చేశాడట. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్న సాయిధరమ్, ఆ సినిమా తరువాత ‘చిత్రలహరి’ షూటింగ్‌లో పాల్గొంటాడని సమాచారం.