పెళ్లికళ వచ్చేసిందే బాలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఓ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న అందాల చందమామ కాజల్‌కు ఈమధ్య కాస్త క్రేజ్ తగ్గినట్టుంది. కారణం- చేస్తున్న సినిమాలన్నీ వరుసగా పరాజయాలు పలకరిస్తుండడంతో కొత్త అవకాశాలు రావడంలేదు. దానికితోడు వేరే కుర్ర హీరోయిన్లు గట్టి పోటీనిస్తుండడంతో కాజల్‌కు క్రేజ్ తగ్గింది. ప్రస్తుతం ‘అ!’ చిత్రంలో నటించి మంచి ప్రశంసలు అందుకున్న ఈమె, మంచి కానె్సప్టు వస్తే భిన్నమైన సినిమాలు చేసేందుకు రెడీ అని చెబుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ- పెళ్లి గురించి ఆలోచించాల్సిన టైమ్ వచ్చిందని ఇంట్లోకూడా వరుడిగా సరైన వ్యక్తిని ఎంచుకోమని చెబుతున్నారని అంటోంది. ప్రేమ, పెళ్లి నా సినిమా కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని నేను అనుకోవడంలేదని, మంచి వరుడు దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటానని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన ఎంఎల్‌ఏ, క్వీన్, హిందీ రీమేక్ పారిస్ పారిస్ చిత్రాల్లో నటిస్తోంది.