తొలిసారి హారర్ చేశా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో వున్న హీరోల్లో శ్రీకాంత్ అంటే ప్రత్యేక గుర్తింపు. ఎందుకంటే స్టార్ ఇమేజ్ కోసం కాకుండా కెరీర్ ప్రారంభంనుంచీ విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన మొదటిసారి హారర్ చిత్రంలో నటించాడు. ‘రారా’ అంటూ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం (నేడు) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ చెప్పిన విశేషాలు...
నా కెరీర్‌లో ఇది 125వ చిత్రం. తొలిసారిగా హారర్ సినిమా చేశాను. ప్రస్తుతం సౌత్‌లో హారర్ ట్రెండ్ బాగా నడుస్తోంది. కొత్తదనముంటే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇంతవరకూ మనం ఇలాంటి హారర్ సినిమాలు ఎన్నో సినిమాలు చూశాం. కానీ ఇది చాలా భిన్నంగా వుంటుంది. ఇందులో దెయ్యాలే మనుషులకు భయపడతాయి. అలాగే వాటికీ మనుషులకీ మధ్య సెంటిమెంట్లు కూడా ఉంటాయి.
దెయ్యంతో ప్రేమ
ఈ చిత్రంలో నేను సినిమా దర్శకుడిగా కన్పిస్తాను. హారర్ సినిమాలు చేయాలనుకునే దర్శకుడు, చివరికి ఓ దెయ్యంతో ప్రేమలో పడతాడు. అది ఆసక్తికరంగా ఉంటుంది.
దర్శకుడు లేడు
నిజానికి ఈ సినిమా మధ్యలో దర్శకుడికి, నిర్మాతకు మధ్య విభేదాలు రావడంతో దర్శకుడు వెళ్లిపోయాడు. కథ అతనిది కాకపోవడంతో మరో పెద్ద దర్శకుడితో ఈ సినిమా చేయించాం. అతనెవరు అనేది రహస్యంగానే ఉంచాం. దర్శకుడు మారినా కూడా అనుకున్న కథను అలాగే తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది.
నెగెటివ్ రోల్
ఆమధ్య నెగెటివ్ రోల్స్ చేయమని చాలామంది అడిగారు. కానీ చేయలేదు. ప్రస్తుతం హీరోగా చేస్తున్నాను కాబట్టి దాని గురించి ఆలోచించడంలేదు. ఇప్పుడే ఎందుకని ఆగాను. ప్రస్తుతం ఆపరేషన్ 2019 చిత్రం చేస్తున్నాను. ఆపరేషన్ దుర్యోధన తరహాలో నేటి రాజకీయాల నేపథ్యంలో సాగేకథ ఇది. చాలా కొత్తగా వుంటుంది.
మా అబ్బాయిలు
చిన్నబ్బాయి రోహన్ కూడా నటిస్తున్నాడు. ప్రభుదేవాతో కలిసి చేస్తున్న సినిమా కూడా హారర్ నేపథ్యంలో వుంటుంది. అది తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. అలాగే పెద్దబ్బాయి రోషన్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో యాక్టింగ్ డిప్లొమా చేస్తున్నాడు. మరో మూడేళ్ల తరువాత హీరోగా చేస్తాడు.

- శ్రీ