రొమాంటిక్ థ్రిల్లర్‌లో నాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని కథానాయకుడుగా శ్రీదేవి మూవీస్ పతాకంపై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సురభి, నివేద థాంప్సన్ కథానాయికలుగా నటించనున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ 40 శాతం పూర్తయింది. నేడు నాని జన్మదినత్సోవ సందర్భంగా నిర్మాత తమ చిత్ర విశేషాలను తెలుపుతూ, ఓ అందమైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో రొమాన్స్, సెంటిమెంట్, వినోదం లాంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని, అన్ని అంశాలతో కూడిన కథ ఇదని తెలిపారు. డిసెంబర్ 2న షూటింగ్ ప్రారంభించి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 40 శాతం చిత్రీకరణ పూర్తిచేశామని, ఈనెల 22నుండి మార్చి 6వరకు కొడైకెనాల్‌లో జరిపే షెడ్యూల్‌లో కొంత టాకీ, పాట చిత్రీకరిస్తామని తెలిపారు. మే చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెనె్నల కిషోర్, ఆనంద్, రోహిణి, సత్యం రాజేష్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీనాయర్, శ్రీముఖి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, పాటలు: సిరివెనె్నల, రామ్‌జో, కృష్ణకాంత్, కెమెరా: పి.జి.విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.