టాక్సీవాలా వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లిచూపులు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ, అర్జున్‌రెడ్డి సినిమాతో సంచలన స్టార్‌గా మారిపోయాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘టాక్సీవాలా’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్2, యువి క్రియేషన్స్ బ్యానర్లపై ఎస్‌కెఎన్ నిర్మిస్తున్న చిత్రమిది. మే 18న విడుదలవుతున్న ఈ సినిమా గురించి నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- విజయ్ దేవరకొండకు వున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఓ పవర్‌ఫుల్ సబ్జెక్టుతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసేలా విజయ్ పాత్ర సాగుతుంది. అతని బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్, స్టైల్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయి. రాహుల్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామన్నారు. ప్రియాంకా జువాల్కర్, మాళవికానాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జుమీనన్, రవిప్రకాష్, రవివర్మ, ఉత్తేజ్, విష్ణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:సుజిత్ సారంగి, ఎడిటింగ్:శ్రీజిత్ సారంగి, సంగీతం:జేక్స్ బిజాయ్, నిర్మాత:ఎస్.కె.ఎన్, దర్శకత్వం:రాహుల్ సంకృత్యాన్.