ఏప్రిల్ 20న భరత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం ‘భరత్ అనే నేను’. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ వచ్చే నెల నుంచి లండన్‌లో జరగనుంది. దాంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 27న విడుదల చేయాలని ప్రకటించారు. కానీ అదే రోజున అటు అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ ఇటు సూపర్ రజనీకాంత్ నటిస్తున్న కాలా చిత్రాలు అదే రోజు విడుదలవుతుండడంతో సినిమాలమధ్య గట్టి పోటీ ఏర్పడింది. భారీ చిత్రాలన్నీ ఒకే రోజు విడుదలకావడం సినీ పరిశ్రమకు మంచిది కాదని పలువురు సినీ పెద్దలు చర్చించి ఇద్దరు నిర్మాతలతో చర్చలు జరిపి రెండు చిత్రాల విడుదల తేదీలను మార్చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు డి.వి.వి.దానయ్య, లగడపాటి శ్రీ్ధర్, బన్నీ వాసు చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ- రెండు భారీ చిత్రాలమధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలన్న ఉద్దేశ్యంతో మా సినిమాల విడుదలను మారుస్తున్నాం. భరత్ అనే నేను చిత్రాన్ని ముందు ప్రకటించిన తేదీకంటే వారం ముందే ఏప్రిల్ 20న విడుదల చేసి ఆ తదుపరి నా పేరు సూర్య చిత్రాన్ని మే 4న విడుదల చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలో ఆరోగ్యరమైన వాతావరణం వుండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా దిల్‌రాజు, కె.ఎల్.నారాయణ, నాగబాబు మాట్లాడుతూ- భారీ చిత్రాలమధ్య పోటీ సరికాదని, దానివల్ల పరిశ్రమకు మంచిది కాదని భావించి రెండు చిత్రాల నిర్మాతలతో చర్చించాం. దానికి వారు కూడా సుముఖంగా తమ చిత్రాల విడుదల తేదీలను మార్చుకున్నారు అని తెలిపారు. నిజంగా ఇది నిర్మాతలమధ్య సఖ్యత కుదరడం పరిశ్రమకు శుభపరిణామంగా భావిస్తున్నాం అన్నారు.