4న గుంటూరు టాకీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుంటూరు టాకీస్’. సిద్ధు, నరేష్ విజయ్‌కృష్ణ, రేష్మీగౌతమ్, శ్రద్ధాదాస్, మంచు లక్ష్మి, మహేష్ మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రాన్ని ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ ఎం. రూపొందించారు. ఈ చిత్రాన్ని వచ్చేనెల 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, వారాహి చలనచిత్ర అధినేతలు ఈ సినిమాను విడుదల చేస్తున్నారని, ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. యూత్‌కు సంబంధించిన కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని డిఫరెంట్ జోనర్‌లో అందరికీ నచ్చేలా రూపొందించామని తెలిపారు.
రేష్మీ నటన హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామిరెడ్డి, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, నిర్మాత: రాజ్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.