వేసవిలో ప్రేమమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళయాలంలో సంచలన విజయం సాధించిన ‘ప్రేమమ్’ సినిమాను తెలుగులో అదే పేరుతో అక్కినేని నాగచైతన్య రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తనకు మరింత పేరుతెచ్చిపెడుతుందన్న నమ్మకాన్ని చైతూ వ్యక్తం చేస్తున్నాడు. ఈమధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు వస్తోన్న రెస్పాన్స్‌కూడా టీమ్ నమ్మకాన్ని రెట్టింపుచేసింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఓ హీరోయిన్‌గా నటిస్తోన్న శృతిహాసన్, సినిమాలో తన పార్ట్ మొత్తాన్ని ఇప్పటికే పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఒక్క పాట మినహా శృతిహాసన్‌కు సంబంధించిన షూట్ పూర్తయిందట. ప్రస్తుతం ఓ మ్యూజిక్ వీడియోకోసం టైమ్ కేటాయించిన శృతి, నెల రోజుల గ్యాప్ ఇచ్చి ఆ పాటను పూర్తిచేస్తారని సమాచారం. ఇప్పటికే ఏభై శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రేమమ్ సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ‘కార్తికేయ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటి దర్శకత్వంలోరూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.