దృశ్యకావ్యం ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌కార్తీక్, కాశ్మీరా కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిమ్ మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో హీరో నిఖిల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారని అన్నారు. ప్రతి సీన్ అందరికీ నచ్చేలా జాగ్రత్తతో రూపొందించామని, అందరూ మనస్సుపెట్టి చేయడంతో దృశ్యకావ్యంగా రూపొందిందని దర్శకుడు రామకృష్ణారెడ్డి అన్నారు. ఓ ఎమోషనల్ లవ్ స్టోరీతో ఉత్కంఠ భరితంగా సాగేలా నిర్మించిన ఈ చిత్రాన్ని మార్చి 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఒక్క ఫైట్, ఒక్క ఐటమ్ సాంగ్ లేకుండా రెగ్యులర్ కమర్షియల్ ఫిలిమ్‌లా ఈ చిత్రాన్ని రూపొందించారని సంగీత దర్శకుడు కమలాకర్ తెలిపారు. లవ్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని కథానాయకుడు రామ్ కార్తీక్ తెలిపారు. కార్యక్రమంలో కాశ్మీరా కులకర్ణి, రచ్చ రవి, మధునందన్, సంతోష్ తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. అలీ, పృథ్వి, సత్యం రాజేష్, చమ్మక్ చంద్ర, రచ్చరవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కమలాకర్, కెమెరా: సంతోష్ శానమోని, నిర్మాణం: పుష్యమి ఫిలిమ్ మేకర్స్, ఎడిటింగ్: వి.నాగిరెడ్డి, దర్శకత్వం: బెల్లం రామకృష్ణారెడ్డి.