నానీతో మోహనకృష్ణ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది ‘భలే భలే మగాడివోయ్’ సినిమా విజయంతో మంచి జోరుమీదున్న నాని ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న సినిమా షూటింగ్ పూర్తికావచ్చింది. ‘అందాల రాక్షసి’ ఫేం హనూ రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత నాని తదుపరి చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే మరో చిత్రం డిసెంబర్ రెండవ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నది. కామెడీ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ కూడా నటిస్తున్నాడు. నానీని హీరోగా పరిచయం చేసిన మోహనకృష్ణ దర్శకత్వంలో ‘అష్టాచమ్మా’ సినిమా తరువాత వస్తున్న ఈ సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడి కానున్నాయి.