నర్తనశాల మొదలైంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛలో చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం నర్తనశాల ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారభోత్సవ పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వంశీ పైడిపల్లి హీరో నాగశౌర్యపై క్లాప్ కొట్టారు.శంకర్‌ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రంతో కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయవౌతున్నాడు. నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, జయప్రకాశ్‌రెడ్డి, అజయ్, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, వెనె్నల కిశోర్, గుండు సుదర్శన్, జెమినీ సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ఛలో చిత్రంతో మాకు బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన ప్రేక్షకులకు, మాకు ఫుల్ సపోర్ట్‌చేసిన మీడియా వారికి మా థ్యాంక్స్. ఎట్ ది రేట్ ఆఫ్ నర్తనశాల చిత్రంతో శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయవౌతున్నారు. కృష్ణవంశీ దగ్గర ఆయన పనిచేశారు. ఈ సినిమా తర్వాత ఆయన కచ్చితంగా పెద్ద దర్శకుడు అవుతారు. మా సంస్థనుంచి మరో కొత్త డైరెక్టర్‌ను పరిచయం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా డెసిషన్‌ను నమ్మిన మా అమ్మకు థాంక్స్. ఇక ఈ చిత్రం డ్యాన్స్ బేస్‌డ్ చిత్రం అని, పాత నర్తనశాల రీమేక్ అని చాలామంది అనుకుంటున్నారు. కానే కాదు. ఇది ఫుల్ ఎంటర్‌టైనర్. నవ్వుకునే చిత్రం. హీరోయిన్స్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇక చూసి చూడంగానే సాంగ్‌తో ఛలో చిత్రానికి సూపర్బ్ సాంగ్ ఇచ్చిన మహతి మరోసారి అంతకంటే అద్భుతమైన పాటలిస్తాడని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నిర్మాత మా అమ్మకు స్పెషల్ థాంక్స్. రెండో సినిమాకు కూడా బయటివారిని కాకుండా ననే్న హీరోగా పెట్టినందుకు అని అన్నారు.దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ...తల్లిదండ్రులు, భగవంతుడి తర్వాత నేను ముందుగా నాగశౌర్యకు... నిర్మాతలు శంకర్‌ప్రసాద్, ఉషగారికి చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే.. ఈ తరహా కథని పర్‌ఫెక్ట్‌గా జడ్జ్‌చేసి సినిమా చేద్దామని ఒప్పుకున్నారు. నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమా చేద్దాం అన్నప్పటి నుంచి ఐరాలో ఫ్యామిలీ మెంబర్ అయ్యాను. ఐరాలో ఆల్రెడీ ఛలో అనే పెద్ద హిట్ ఉంది. దాన్ని మించేలా సినిమా రూపొందిస్తానని మాటిస్తున్నాను. నాకు పెద్ద పెద్ద టెక్నీషియన్స్‌ని ఇచ్చారు. చాలా థాంక్స్ అని అన్నారు.నాగశౌర్య, నరేష్, జయప్రకాష్‌రెడ్డి, అజయ్, పోసాని కృష్ణమురళి, తదితరులునటిస్తున్నఈచిత్రానికిఆర్ట్: కిరణ్‌కుమార్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు(చంటి), తమ్మిరాజు, సంగీతం: మహతి స్వరసాగర్