నాకే కొత్తగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. 1980 నేపథ్యంలో జరిగే కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- వైజాగ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడ అభిమానుల్ని చూస్తుంటే ప్రారంభంలో చేసిన ‘ఆరాధన, అభిలాష’ చిత్రాలు గుర్తొస్తాయి. అప్పట్లో బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ వైజాగ్ అంతటా తిరిగిన రోజులు గుర్తొస్తున్నాయి. ‘రంగస్థలం’ చరణ్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే చిత్రం అవుతుంది. నిర్మాతలు బ్యానర్ వాల్యూతో ఉన్నతమైన చిత్రాలు నిర్మిస్తున్నారు. సుకుమార్ అద్భుతమైన పనితనాన్ని చూపించారు. పక్కా విలేజ్ నేపథ్యంలో ఉండే చిత్రమిది. ఎలా చెప్పాడో అంతకన్నా బాగా తెరకెక్కించాడు సుకుమార్. నాకు ఖైదీ ఎలాగో చరణ్‌కు ఈ చిత్రం అలా స్టార్ స్టేటస్‌ను పెంచుతుంది. ఓ రకంగా ఇంత మంచి సినిమా చరణ్ చేస్తున్నందుకు ఈర్ష్యగా కూడా వుంది. కానీ తండ్రిగా గర్వపడుతున్నాను. చరణ్‌లో పరిపూర్ణమైన నటుడు వెలికితీసే ప్రయత్నం ఇది. చరణ్ కూడా అద్భుతంగా నటించాడు. సమంత పాత్రలో ఒదిగిపోయింది. అన్ని విభాగాలవారు వందశాతం ఎఫర్ట్ పెట్టారు. ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చడమే కాకుండా అవార్డులు కూడా అందుకుంటుంది అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ- ఒక ఊరిని ఎంత అందంగా చూపించాలో రత్నవేలు అంత బాగా చూపించాడు. ఆపద్బాంధవుడు సినిమా సమయంలో నాలుగైదుసార్లు నాన్నతో కలిసి నెల్లూరు వెళ్లాను. ఆ తరువాత పల్లెటూళ్ళకు వెళ్లలేదు. కానీ ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. సుకుమార్‌తో సినిమా చేయడం మర్చిపోలేని అనుభూతి. నన్ను నాకే కొత్తగా పరిచయం చేశాడు. సమంతతో పనిచేస్తే కొత్త ఎనర్జీ వస్తుంది. దేవి అద్భుతమైన సంగీతాన్నిచ్చాడు. చంద్రబోస్ లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సుకుమార్ అంటే విపరీతమైన గౌరవం పెరిగింది. ఈ సినిమా షూటింగ్ పూర్తికావడంతో అతన్ని రోజూ చూడలేనేమోనని బెంగ పట్టుకుంది. ఈ సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, సురేఖ, పూజా హెడ్డే, సమంత, చరణ్ తదితరులు పాల్గొన్నారు.