టాక్సీవాలా ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాలతో యువ హీరోగా స్టార్ ఇమేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సీవాలా’. గీతా ఆర్ట్స్ 2, యువి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్.కె.ఎన్. నిర్మాత. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం మే 18న విడుదల కానుంది. ఈ నెల 23న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- విజయ్ దేవరకొండ క్రేజ్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఈ కథని దర్శకుడు అద్భుతంగా తయారుచేశాడు. దానికి తగ్గట్టే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే చిత్రమిది. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మిస్తున్నాము. ఈ చిత్రాన్ని మే 18న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నాము అన్నారు. ప్రియాంకా జువాల్కర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:జేక్స్ బిజయ్, ఎడిటింగ్:శ్రీజిత్ సారంగ్, కెమెరా:సుజిత్ సారంగ్, నిర్మాత:ఎస్.కె.ఎన్, దర్శకత్వం:రాహుల్ సాంకృత్యాన్.