అందమైన కలయిక రాజరథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రాజరథం’ విడుదల దగ్గరయ్యేకొద్దీ చిత్ర బృందం మరో పాటని విడుదల చేశారు. ‘నిన్ను నేను ప్రేమించానంటూ’ అంటూ సాగే ఈ యుగళ గీతం వినసొంపుగా ఉండడమేగాక, అద్భుతమైన దృశ్యాలతో కనువిందు చేయనుంది. బర్ఫీ, జగ్గా జాసూస్ వంటి చిత్రాలకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ రజత్ పొద్దార్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పాటని ఊహ, వాస్తవాల కలయికగా ఒక భారీ సెట్‌లో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఊటీ అడవుల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ పాటకోసం అడవుల్లోనే భారీ సెట్ నిర్మించారు. ఈ పాట కోసం ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌వారు ప్రతిరోజూ ఎంతో శ్రమించి సెట్‌ని నిర్మించారు. అటవీశాఖవారి నియమాల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత సెట్ ఉంచకూడదు. అందుకని రోజూ ఉదయం 3 గంటలకి సెట్ నిర్మాణం మొదలుపెట్టి సాయంత్రం 6 గంటలకి మళ్లీ తీసేసేవారు.చిత్ర సంగీత దర్శకుడు, దర్శకుడు అయిన అనూప్ 90ల పాటల్లో ఉండే రొమాంటిక్ ఫ్లేవర్‌తో ఈ పాట ఉండాలని అందుకోసం 40 మంది సంగీత నిపుణులతో వయొలిన్, సెల్లోస్‌లతో కూడిన ఆర్కెస్ట్రాని ఉపయోగించారు. ఇప్పటికీ సరిపోయే పదాలతో రామజోగయ్యశాస్ర్తీ పాటని రచించి పాటకి నిండుదనాన్ని తెచ్చారు. ఈ చిత్రంలోని అన్ని పాటల ఆర్కెస్ట్రాకి ప్రముఖ సాక్స్ వాయిద్యకారుడు సాక్స్ రాజా ఆధ్వర్యంలో నిర్వహించారు. చాలాకాలం తర్వాత ఇంత మంచి మెలోడీలకి పనిచేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని స్వయంగా సాక్స్ రాజా చెప్పడం విశేషం.