తొలిప్రేమ దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు, యువ హీరో అఖిల్ ఎట్టకేలకు తన తదుపరి సినిమా వివరాలను ట్విట్టర్ వేదికగా ఉగాది పండుగ సంద్భంగా స్వయంగా ప్రకటించాడు. ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నట్లు ట్వీట్ చేశాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు నిజమేనంటూ అఖిల్ తాజాగా చెప్పడం గమనార్హం. ‘ఆదివారాలు చాలా లలీగా ఉంటాయి కదూ, ఈ లలీ ఆదివారం నా కొత్త సినిమా ప్రాజెక్టు’వివరాలను వెల్లడించాలనుకుంటున్నాను. వెంకీ అట్లూరి నా కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తారు.మేలో చిత్రీకరణ మొదలవుతుంది. బీవిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత అని అఖిల్ ట్వీట్ చేశారు. అయితే అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పాలయిన విషయం తెలిసిందే. ఇటీవల విక్రమ్ కెకుమార్ దర్శకత్వంలో చేసిన ‘హలో’ మాత్రం కాస్త పర్వాలవేదనిపించింది. దీంతో తన మూడో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. వరుణ్‌తేజ్ హీరోగా వెంకీ అట్లూరి తీసిన తొలిప్రేమ చిత్రం ఫీల్‌గుడ్ మూవీస్ ప్రేక్షకులనుంచి నీరాజనాలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో అఖిల్‌కు ఆయన తీయబోయే సినిమా కూడా ప్రేమకథగానే ఉండొచ్చని సమాచారం.