త్వరలో సీతమ్మ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్, ఆర్తన జంటగా శ్రీనివాస్‌గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.శైలేంద్రబాబు, హరీశ్ దుగ్గిశెట్టి, కె.వి.శ్రీ్ధర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను గురించి నిర్మాతలు తెలియజేస్తూ సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన చిత్రమిదని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కొత్తనటి ‘ఆర్తన’ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నామని, ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజ్‌తరుణ్ పాత్ర చాలా కొత్తగా వుంటుందని, పతాక సన్నివేశాలను భారీ స్థాయిలో తెరకెక్కించామని అన్నారు. ఈ నెలలో పాటలను విడుదల చేసి జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:గోపిసుందర్, ఎడిటింగ్:కార్తిక్ శ్రీనివాస్, కెమెరా:విశ్వ, సమర్పణ:శ్రీమతి పూర్ణిమ, దర్శకత్వం:శ్రీనివాస్ గవిరెడ్డి.