అన్యాయాన్ని ప్రశ్నిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీష్‌బాబు, అక్షిత జంటగా రాజా వనె్నంరెడ్డి దర్శకత్వంలో జనం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సత్యారెడ్డి నిర్మిస్తున్న ‘ప్రశ్నిస్తా’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత జెమిని కిరణ్ స్విచ్చాన్ చేయగా, దర్శకుడు బాబి క్లాప్‌కొట్టారు. సీనియర్ దర్శకుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ- మా సంస్థలో ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చేశాను. ఇప్పుడు మా అబ్బాయితో సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా వుంది. గత రెండేళ్లుగా నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఇది సందేశాత్మకంగా వుంటుంది. కమర్షియల్ హంగులన్నీ ఉంటాయి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- చాలాకాలంగా వాళ్ళ అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలని నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచి కథ కుదిరింది. ఇప్పటివరకూ పలు జోనర్‌లలో సినిమాలు చేసిన నేను, మరో జోనర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. ప్రశ్నిస్తా అనే పేరులోనే చాలా అర్థాలున్నాయి. అదేమిటనేది సినిమా చూస్తే తెలుస్తుంది. నేటినుంచి రెగ్యులర్ షూటింగ్ పది రోజులపాటు హైదరాబాద్‌లో జరుపుతాం. ఆ తరువాత మరో ఇరవై రోజులు కూడా హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుపుతాం అన్నారు. సంగీత దర్శకుడు ప్రేమ్ మాట్లాడుతూ- ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయి. ప్రస్తుతం ఒక్క పాట రికార్డింగ్ అయింది అన్నారు. ఈ చిత్రానికి రచన:రాజేంద్రకుమార్, కెమెరా:యోగిరెడ్డి, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం:ఎల్.ఎం.ప్రేమ్, నిర్మాత:సత్యారెడ్డి, సమర్పణ:బి.శేషుబాబు, దర్శకత్వం:రాజా వనె్నంరెడ్డి.