భయపెడుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య దక్షిణాదిలో హారర్ సినిమాల హవా ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పటికే ఈ నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి, వస్తూనే వున్నాయి. ఈ తరహా సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోయిన్లు సైతం ఆసక్తి చూపిస్తుండడంతో దర్శక నిర్మాతలు హారర్ నేపథ్యంలో సినిమాలు తీయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాల్ని అందుకుంటున్నాయి హారర్ సినిమాలు. తాజాగా సీనియర్ హీరోయిన్ కూడా హారర్ సినిమాతో భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపు దశాబ్దకాలంపాటు క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మాజీ హీరోయిన్ భూమిక ఇటీవలే సెకెండ్ ఇన్నింగ్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. నాని హీరోగానటించిన ఎంసిఏ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె, తాజాగా నాగచైతన్యతో సవ్యసాచి చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. దాంతోపాటు కన్నడంలో ఘనవిజయం సాధించిన యుటర్న్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తోంది సమంత. ఈ చిత్రంలోనూ కీలక పాత్రకోసం భూమికను సంప్రదించారట. కథ నచ్చడంతో ఆమె ఓకె చెప్పిందని, ఇందులో భూమిక పాత్ర దెయ్యంగా కన్పిస్తుందని వార్తలొస్తున్నాయి.