ప్రత్యేక ఆటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రం ఈనెల 30న భారీగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా 1980 నేపథ్యంలోని కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ న్యూలుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి విజయాన్ని అందుకోవడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఈనెల 30న విడుదలయ్యే ఈ సినిమా కోసం బెనిఫిట్ షోలను ప్లాన్ చేశారు నిర్మాతలు. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వినతిపత్రాన్ని సమర్పించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా కోసం ప్రత్యేక షోలు వేసుకోవచ్చు అంటూ అనుమతి ఇచ్చింది. 30వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 10 గంటలలోపు షోలు వేసుకోవచ్చని తెలిపింది. ఈ షోలు 30వ తేదీ నుండి వారంపాటు నడవనున్నాయట. ఇంకా తెలంగాణ ప్రభుత్వం నుండి అనుమతి రావాల్సి వుంది. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.