భరత్ హవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఇండియా వైజ్‌గా టాప్ రేంజ్‌లోవున్న ఈ టీజర్ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానాన్ని చేరుకోవడం విశేషం. ముఖ్యమంత్రిగా మహేష్ లుక్ అద్భుతంగా వుందని ప్రశంసలు వస్తున్నాయి. శ్రీమంతుడు లాంటి సంచలన విజయం తరువాత మహేష్ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంలోని పాటల్ని ఈనెల 31న విడుదల చేస్తారట. అలాగే ఏప్రిల్ 7న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చేస్తారని తెలిసింది. డి.వి.వి. క్రియేషన్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 20న అత్యంత భారీగా విడుదలవుతోంది. ఈ సినిమా టీజర్ ప్రపంచంలో రెండవ స్థానంలో వుండడంతో అందరూ షాక్ అవుతున్నారు. హాలీవుడ్ మూవీ సివిల్ వార్ సినిమాను లైక్ చేశారు. 6,58,000 లైక్‌లతో మొదటి స్థానంలో ఉంటే, 6,40,000 లైక్‌లతో భరత్ రెండవ స్థానంలో నిలిచాడు.