నాయకి ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిష కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘నాయకి’. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి గోవి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసి, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. వీడియో మోషన్‌పోస్టర్‌ను హైదరాబాద్‌లో కథానాయిక త్రిష విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, మార్చి రెండో వారంలో ఆడియోను, నెలాఖరుకు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. హారర్ జోనర్‌లో సరికొత్త రకమైన స్క్రీన్‌ప్లేతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో త్రిష తన కెరీర్‌లోనే అద్భుతమైన నటన ప్రదర్శించిందని, ఆ పాత్రలో విభిన్నమైన కోణాలుంటాయని దర్శకుడు గోవి తెలిపారు. ఈ చిత్రం తప్పక విజయవంతవౌతుందన్న నమ్మకం వుందన్నారు. గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, జీవి, సత్యంరాజేష్, జయప్రకాష్, సుష్మారాజ్, కోవైసరళ, మనోబాల తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: రఘు కుంచె, పాటలు: భాస్కరభట్ల, ఎడిటింగ్: గౌతంరాజు, దర్శకత్వం: గోవి.