దర్శకుడిని అర్థం చేసుకుంటే అద్భుతాలు -- సినిమాటోగ్రాఫర్ రత్నవేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా అటు బాక్స్‌ఆఫీస్‌వద్ద దూసుకుపోతుంది. 1980ల నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాడు కెమెరామెన్ రత్నవేలు. నాటి పరిస్థితులను కళ్ళకుకట్టినట్టు అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా రత్నవేలు చెప్పిన విశేషాలు...
ఇంత గొప్పగా రావడానికి..
సినిమాటోగ్రాఫర్ అంటే జస్ట్ కెమెరామెన్ కాదు. అతనికి, దర్శకుడికి మధ్యన మంచి రిలేషన్ ఉంటేనే ఇలాంటి ఔట్‌పుట్ సాధ్యం. మా మొదటి సినిమా ‘ఆర్య’నుండి నాకు, సుకుమార్‌కు అలాంటి రిలేషన్ ఉంది. నేను ఏ సినిమాకైనా ముందే పూర్తి స్క్రిప్ట్‌వింటాను. ఈ సినిమాకి కూడా పలుసార్లు సుకుమార్, నేను స్క్రిప్ట్ గురించి చర్చించుకున్నాం. ఆయన రాసింది విలేజ్ డ్రామా. కాబట్టి ప్రేక్షకుల్ని 80ల కాలంలోకి తీసుకెళ్ళాలి. సినిమా రస్టిక్‌గా, అందంగా ఉండాలి. తెలుగు కల్చర్ ఉట్టిపడేలా ఉండాలని జాగ్రత్తలు తీసుకున్నాం.
ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్‌ని కాప్చర్ చేయడానికి చాలా ట్రై చేశాం. అందుకే ఎక్కువ వైడ్ షాట్స్ ఉంటాయి. ప్రతి సీన్‌కి ముందు ఆర్ట్ టీమ్, కాస్ట్యూమర్‌తో కూర్చుకుని సన్నివేశంలో ఏంఉండాలి. ఏం ఉండకూడదు అనేవి ముందే డిసైడ్‌చేసే వాళ్ళం. అందరూ క్రమశిక్షణతో వర్క్ చేయడంవలనే ఈ సక్సెస్ సాధ్యమైంది.
ఫీడ్ బ్యాక్...
సాధారణంగా సినిమాటోగ్రాఫర్‌కు అంతగా పేరురాదు. కానీ ఈ సినిమాలో మాత్రం నా గురించి చాలామంది మాట్లాడుతున్నారు. విడుదలైన మొదటి రోజు కూడా ఎంతోమంది నాకు ఫోన్‌చేసి మెచ్చుకున్నారు. క్రిటిక్స్, ప్రేక్షకులు కూడా ప్రత్యేకంగా అభినందించారు.
నాకు సినిమా అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కువ టైంతీసుకుని తక్కువ సినిమాలు చేస్తాను. ‘రోబో’ హిట్ తర్వాత కూడా చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఏదీ చేయలేదు. సుకుమార్, మహేష్ ప్రాజెక్ట్‌చేశాను. చిన్న సినిమా ‘కుమారి 21 ఎఫ్’కు కూడా నా పూర్తిస్థాయి సహకారం అందించాను.
ఇలాంటివి అరుదుగా
వస్తాయి..
ఈ సినిమాని హార్ట్ అండ్ సోల్ పెట్టి చేశాను. నా బిగ్గెస్ట్ హిట్. పేరు వచ్చిన సినిమా ‘సేతు’. దాని తర్వాత అంతటి సినిమా ఈ ‘రంగస్థలం’. ఇలాంటి సినిమాలు ఎప్పుడో కాని రావు. ఇక సుకుమార్‌తో నాది 14 ఏళ్ల జర్నీ. సుకుమార్ అన్ని అంశాల్ని పట్టించుకుంటాడు కానీ కెమెరా విషయంలో ఏం మాట్లాడడు. అతనికేం కావాలో అదే ఇస్తాననే నమ్మకముంది నా మీద. ఇక ప్రస్తుతం మెగాస్టార్ సైరా సినిమా చేస్తున్నాను. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తిచేసాం.. మెగాస్టార్‌తో పనిచేయడం గొప్ప అనుభూతి.

- శ్రీ