అబ్బాయి నచ్చకపోతే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరణ్‌తేజ్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో ‘నేనే లోకల్’ చిత్ర దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన స్టోరీ, దర్శకత్వ పర్యవేక్షణలో, ప్రముఖ దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఆయుష్మాన్‌భవ. ఈ చిత్రాన్ని సి.టి.ఎఫ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కథనంతో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్‌లో బేబిడాళ్, హ్యాంగ్ ఓవర్, హైహీల్స్ లాంటి సూపర్బ్ సాంగ్స్ కంపోజ్ చేసిన మీట్‌బ్రోస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ స్నేహఉల్లాల్ చరణ్‌తేజ్ సరసన నటిస్తోంది. సమాజం ప్రేమని చూసే పద్ధతి మారాలి అనే కమర్షియల్ పాయింట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మనకి నచ్చిన అబ్బాయి మన వాళ్లకి నచ్చకపోతే ప్రాబ్లమ్ వాళ్లది.. దానికి మనం ఎందుకు సూసైడ్ చేసుకోవాలి.. తప్పు అలా అని పారిపోతే పిరికితనం.. ఓడిపోతే చేతకాని తనం.. ఇదే జీవితమా అని ప్రశ్నించే మరో పాత్రలో మరో హీరోయిన్ హుజన్. ఈరోజు హుజన్ పుట్టినరోజు సందర్భంగా సారాగా తన మొదటి లుక్‌ని విడుదలచేశారు హుజన్. ఈ సందర్భంగా చరణ్‌తేజ్ మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రానికి ఇంత మంచి కథని అందించటమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న సూపర్ సక్సస్‌ఫుల్ దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన గారికి, స్క్రీన్‌ప్లే అందించిన ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్‌కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే క్రేజీ దర్శకుడు మారుతి మా చిత్రానికి సహ నిర్మాతగా బాధ్యతలు స్వీకరించినందుకు వారికి నా ధన్యవాదాలు. మేము అడిగిన వెంటనే మా కథ నచ్చి మా చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్న స్నేహ ఉల్లాల్‌కి థ్యాంక్స్. స్నేహ ఉల్లాల్ పాత్ర చాలా బాగా డిజైన్ చేశాం. మాకు ఆడియో బాలీవుడ్ సూపర్ మ్యూజిక్ దర్శకుడు మీట్ బ్రోస్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మీట్‌బ్రోస్ అందించిన ఆడియోనే యూత్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్‌గా వాళ్లు మా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రం తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతున్నాం అని అన్నారు.