ఎవరీ సైంధవుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతున్న టైటిల్ సైంధవ. ‘్ఛలో’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగశౌర్య హీరోగా నటించే తదుపరి చిత్రానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. నూతన దర్శకుడు తెరకెక్కించే ఈ సినిమాకు సైంధవుడు అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం నర్తనశాల చిత్రంలో నటిస్తున్న నాగశౌర్యకు కొత్త దర్శకుడు అద్భుతమైన కథను చెప్పాడని, కథ నచ్చడంతో ఆ సినిమా చేయడానికి అంగీకరించాడట. ఆ చిత్రానికి ఈ టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో వున్నారు. సైంధవుడు పాత్ర మహాభారతంలో కనిపిస్తుంది. ద్రౌపది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సైంధవుడిని పాండవులు ప్రాణభిక్ష పెట్టడంతో బతికి బట్టకడతాడు. తరువాత అభిమన్యుడి మరణానికి కారణమైన సైంధవుడి పాత్రగానే నెగెటివ్ షేడ్‌లో వుంది. మరి ఈ సినిమా కథాకమామీషు ఏమిటోగానీ, టైటిల్ మాత్రం ఆసక్తి రేపుతోంది.