జోరులో సవ్యసాచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం సవ్యసాచి.. ఫుల్ పేస్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్‌గా తన భార్యతో కలిసి అమెరికా ట్రిప్ వేసొచ్చిన చైతు.. ఇపుడు సవ్యసాచి షూటింగ్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటున్నాడు. జూన్ నెలలో విడుదల టార్గెట్ పెట్టుకోవడంతో.. ఈ లక్ష్యాన్ని అందుకునేందుకు చకచకా పనులు ఫినిష్ చేస్తున్నాడు. సవ్యసాచి అంటే నిజానికి అర్జునుడు అనే సంగతి తెలిసిందే. రెండు చేతులతోను గురి చూసి బాణం వేయగల దిట్ట కాబట్టే.. ఆయనకు ఆ పేరు వచ్చింది. అలాగే ఈ సినిమా టైటిల్ ప్రకారం చైతు పాత్రకు కూడా ఇలాగే రెండు చేతులను చాలా ఎఫెక్టివ్‌గా ఉపయోగించగల కెపాసిటీ ఉంటుందట. ఈ కానె్సప్టు ఆధారంగా ఓ ఫైట్ సీన్‌ను డిజైన్ చేశారట. తూప్రాన్‌లో వున్న స్టీల్ ఫ్యాక్టరీలో తన రెండు చేతులను ఓ పద్ధతి ప్రకారం ఉపయోగించి రౌడీలను ఇరగదీసే ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ ఫైట్‌తోపాటు సినిమాలోని అన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను రామ్-లక్షణ్‌లు కంపోజ్ చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న యాక్షన్ సీక్వెన్స్ మాత్రం సినిమాకు మేజర్ హైలెట్స్ అవుతాయనే టాక్ ఉంది. చందూ మొండేటి దర్శకత్వంలో థ్రిల్లర్ జోన్‌లో సవ్యసాచి రూపొందుతోంది. మాధవన్, భూమిక వంటి సీనియర్ స్టార్లు ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కీరవాణి అందించే సంగీతం ఆకట్టుకోనుంది. జూన్ 14న చిత్రాన్ని విడుదల చేస్తారట.