రీ ఎంట్రీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో అత్త పాత్రకు కొదవే లేదు. ఒకప్పుడైతే అత్తకు.. అల్లుడికి మధ్య గట్టి పోరు ఉండేది. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమాలు మంచి విజయాలుగా నిలవడంతో అత్త పాత్రలకు క్రేజ్ దక్కింది. అంతకంటే మరో అడుగు ముందుకేస్తే.. అసలు అత్త పాత్ర అనగానే సూర్యకాంతం గుర్తొచ్చే రేంజ్‌లో ఆమె ఆయా పాత్రల్లో జీవించేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మళ్లీ అత్త పాత్రలకు గిరాకీ బాగా పెరిగింది. పవన్‌కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో మళ్లీ వీళ్ల హవా మొదలైంది. సరే ఈ కథంతా దేనికంటే.. తాజాగా అత్త పాత్రలో ఎంట్రీ ఇస్తుంది మాజీ గ్లామర్ హీరోయిన్ సిమ్రాన్. 90వ దశకంలో సిమ్రాన్ సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా తనదైన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఈమధ్యే పెళ్లిచేసుకుని సినిమాలకు దూరం అయినా ఈమె మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. తాజాగా తమిళంలో శివకార్తికేయన్, సమంత జంటగా పోనారామ్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో సిమ్రాన్ కీరోల్ పోషిస్తుందట. అందులో ఆమె అత్త పాత్రలో కనిపిస్తుందని. ఆమెకు జోడిగా మలయాళ నటుడు లాల్ నటిస్తున్నాడట. దాంతోపాటు తెలుగులో సప్తగిరి హీరోగా ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోకూడా సిమ్రాన్ నటిస్తుంది. అత్తా-అల్లుడి మధ్య వైరం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. మరి గ్లామర్ హీరోయిన్‌గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న సిమ్రాన్ అత్తగా ఎలా అలరిస్తుందో చూడాలి..