‘బ్యూటీఫుల్ లవ్’ వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. కె.నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీషాశ్రీ్ధర్ నిర్మాతగా, బన్నీవాసు సహ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో యాక్షన్‌కింగ్ అర్జున్, శరత్‌కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆమధ్య విడుదల చేసిన సైనిక పాటతో తనలోని దేశభక్తిని చాటుతున్న అల్లుఅర్జున్... ఈమధ్యే విడుదల చేసిన ‘లవర్ ఆల్సో ఫైటర్ అల్సో..’ పాట ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇక ఇప్పుడు ‘బ్యూటీఫుల్ లవ్..’ అంటూ సాగే పాటను నిర్మాతలు లగడపాటి శ్రీ్ధర్, శిరీషాశ్రీ్ధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీ్ధర్ మాట్లాడుతూ- ‘‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ సినిమాలోని బ్యూటీఫుల్ లవ్ సాంగ్‌ని విడుదల చేశాం. ఇది నా ఫేవరేట్ సాంగ్. నాకు బాగా నచ్చింది. మంచి మెలోడీ. విశాల్ శేఖర్ అన్ని పాటలు చాలా బాగా ఇచ్చారు. స్పెషల్‌గా ఈ సాంగ్ సూపర్‌గా వచ్చింది. సింగర్స్ ఆర్మానీ మాలిక్, చైత్ర, అంబడిపూడి. అద్భుతంగా పాడారు. సీతారామశాస్ర్తీగారు మంచి సాహిత్యం అందించారు. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పనక్కర్లేదు. యాక్షన్ పార్ట్‌చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. సినిమా చాలా బాగావచ్చింది. ముఖ్యంగా మా దర్శకుడు వక్కంతం వంశీ టైటిల్‌కి తగ్గట్టుగా కథను అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిస్తున్నారు. వారం రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. దీంతో గుమ్మడికాయ కొట్టేస్తున్నాం. ఈనెల 22న గ్రాండ్‌గా ఆడియో రిలీజ్ చేస్తున్నాం. 29న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. మే 4న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఈ వేసవిలో ‘రంగస్థలం’ అద్భుతమైన హిట్ కొట్టింది. అలాగే మహేష్‌బాబు ‘్భరత్ అనే నేను’ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాం. ఈ సమ్మర్ కానుకగా వస్తున్న ‘నాపేరు సూర్య..’ సినిమా అందరినీ తప్పకుండా అలరిస్తుంది. ఇక జాతీయ అవార్డులు గెలుచుకున్న బాహుబలి, ఘాజీటీమ్ అందరికీ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం’’ అని అన్నారు. లగడపాటి శిరీషాశ్రీ్ధర్ మాట్లాడుతూ- ‘‘అల్లుఅర్జున్‌తో కలిసి వర్క్‌చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు బ్యూటీఫుల్ సాంగ్ చాలా చాలా ఇష్టం. మంచి మెలోడీ ఇచ్చారు. వాల్ట్‌డిస్నీ సాంగ్ విన్నట్టుగా ఉంది. విశాల్ శేఖర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మే 4న మీ ముందుకు వస్తున్నాం. అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు. అల్లుఅర్జున్, అనూ ఎమ్మాన్యూయేల్ యాక్షన్‌కింగ్ అర్జున్, శరత్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు(చంటి), సాహిత్యం: సీతారామశాస్ర్తీ, రామజోగయ్యశాస్ర్తీ, సినిమాటోగ్రఫీ: రాజీవ్వ్రి, సంగీతం: విశాల్-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు, సమర్పణ: కె.నాగబాబు, సహ నిర్మాత: బన్నీవాసు, నిర్మాత: శిరీషా శ్రీ్ధర్ లగడపాటి, రచన, దర్శకత్వం: వక్కంతం వంశీ.