భరత్ అనే నేను సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం ‘్భరత్ అనే నేను’. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 20న విడుదలకు సిద్ధమైంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎలాంటి కట్ లేకుండా యు/ఎ సర్ట్ఫికెట్‌ను సెన్సార్ అందజేసింది. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది. శ్రీమంతుడు లాంటి సంచలన విజయం తరువాత మహేష్-కొరటాల కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా అటు ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. మహేష్ ముఖ్యమంత్రిగా కన్పించనున్న ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు రేపేందుకు సిద్ధమైంది.