27న ఎవెంజర్స్ ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్వెల్ స్టూడియోస్ వారి ‘ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్’ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సూపర్ హీరోల అందరి కలయిక. మార్వెల్ స్టూడియోస్ 10 సంవత్సరాల ప్రస్థానానికి ‘ఎవెంజర్స్’ ‘ఇన్ఫినిటీవార్‌ని క్లైమాక్స్‌గా చెప్పొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈనెల 27న విడుదలవుతోంది. ఇందులో తెలుగు వెర్షన్‌కి సౌత్ స్టార్ హీరో రానా దగ్గుబాటి భాగమయ్యారు. ఇన్ఫినిటీ వార్ విలన్ తావోస్‌కి డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ- నేను మార్వెల్ కామిక్స్‌ని చదువుతూ పెరిగాను. సూపర్ హీరోల కథలని ఆకట్టుకునేలా, ఎన్నో భాగాలుగా చెప్పడం మార్వెల్ సినిమాల గొప్పదనం అన్నారు. ఏప్రిల్ 27న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 2డి, 3డి, ఐమాక్స్ 3డిలలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది.