బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు -- జీవితారాజశేఖర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా అభిమానులకు, సామాన్య ప్రజానీకానికి, నా కుటుంబాన్ని అభిమానించే వారికి నా నమస్కారాలు. ఈనెల 14న టిఆర్‌పి రేటింగ్సే పరమావధిగా తమ ఎదుగుదలకోసం ఎవరిపైన బురద చల్లడానికైనా వెనుకాడని ఘనత వహించిన ‘మహా న్యూస్’ అనే దగా, న్యూస్ ఛానల్‌వారు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అసందర్భంగా తానొక మహిళను అని మరిచిపోయిన ఒక మహిళా నాయకులు ఏరకమైన సాక్ష్యాధారాలు లేకుండా నామీద, నా కుటుంబం మీద నా వ్యక్తిగత, కుటుంబ పరువుప్రతిష్టలు దిగజార్చే విధంగా మాట్లాడిన విషయం మీ అందరికీ తెలుసు. సదరు విషయం ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆధారాలు ఏమిటి? అని ప్రశ్నించకుండా ఆమె మాట్లాడింది. అంతా నిజమే అని ప్రజలను నమ్మించే విధంగా ప్రవర్తించిన సదరు మహాన్యూస్ ప్రయోక్త మూర్తికి, నిరాధారమైన ఆరోపణలు చేసిన పి.ఓ.డబ్ల్యూ సంధ్యకు ఇదే నా సమాధానం. ఛానల్ చేతిలో ఉంది కదా అని ఏమైనా మాట్లాడగలం అనుకోవద్దు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు మీ మీద నేను తీసుకొనబోవు సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండండి అని హెచ్చరిస్తున్నాను. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దు అనీ, ఇవన్నీ నేను సినిమా రంగంలోని కాస్టింగ్ కోచ్ మీద వేయబోయే కమిటీలో ఒక సభ్యురాలిగా ఉండబోతున్నానని తెలుసుకుని దానివల్ల వారికేదో అన్యాయం జరుగుతుందని ఊహించి కొందరు పథకం ప్రకారం ఆడుతున్న నాటకం అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా గౌరవనీయమైన పదవిలో ఉన్న నేను ఇటువంటి ‘సి’ గ్రేడ్ న్యూస్ ఛానల్ గురించి, సంసారాలు నాశనం చేసుకుని పబ్లిసిటీ కోసం ఎవరిమీద పడితే వాళ్ళమీద అసత్య ప్రచారాలు చేసుకుంటూ రోజు టీవీలలో కనపడే వాళ్ళకు, నేను అదే ఛానళ్ళలో కూర్చొని నా సమాధానం చెప్పడం ఇష్టంలేక ఈ బహిరంగ ప్రకటన విడుదల చేస్తున్నాను. ఒక స్ర్తిగా నేను ఏనాడు సాటి ఆడదానికి అన్యాయం చెయ్యలేదని వారు ఆరోపించిన వన్నియు నిరాధారమైనవి అని మరియు అవి వారి ఊహలని తెలియచేస్తూ, ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రసారంచేస్తున్న సదరు ప్రసార మాధ్యమాలను ప్రజలే బహిష్కరించాలని కోరుతున్నాను అన్నారు.