27న ఊ.పె.కు.హ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో బేబీ లక్ష్మీనరసింహా హిమఋషిత సమర్పణలో జెబి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి నిర్మించిన సినిమా ‘ఊ.పె.కు.హ’. ‘ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి’ అనేది క్యాప్షన్. సాక్షీచౌదరి కథానాయిక. ‘నిధి’ప్రసాద్ దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇటీవల విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27న వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘దర్శకులు నిధిప్రసాద్‌గారు సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా బాగా సహకరించారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరినీ అలరించే చిత్రమవుతుంది.’ అన్నారు. దర్శకుడు నిధి ప్రసాద్ మాట్లాడుతూ.. ‘సినిమా అనుకున్న దానికంటే కూడా చాలాబాగా వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. రాజేంద్రప్రసాద్‌గారి నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. అలాగే అనూప్ సంగీతం మరో హైలైట్. సినిమాలో నటించిన నటీనటులందరూ ఎంతగానో సహకరించారు. అలాగే సాంకేతిక నిపుణులు కూడా సహకారం అందించారు. ఈ నెల 27న హడావుడి మొదలవుతుంది. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది...’ అని అన్నారు. ఈ చిత్రానికి డిఓపి: వాసు, ఎడిటర్: శంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.ఆర్.నాగరాజు, సంగీతం: అనూప్ రూబెన్స్, ప్రొడ్యూసర్: శ్రీమతి భాగ్యలక్ష్మి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: నిధి ప్రసాద్.