యదార్థ సంఘటనలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాగిన్ మీడియా శ్రీ్ధర్‌రెడ్డి ఆశీస్సులతో బాలరాజుగౌడ్ సమర్పించు ప్రొడక్షన్ నెంబర్.2 సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ బోడుప్పల్‌లోని బంగారు మైసమ్మతల్లి దేవాలయంలో రాజకీయ ప్రముఖుల మధ్య ఘనంగా జరుపుకుంది. అనంతరం ఎం.యస్.ఆర్. ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి బోడుప్పల్ వరకు దాదాపు వెయ్యి మంది యూత్‌తో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంలోనే ఈ నూతన చిత్రానికి సర్వే సత్యనారాయణ క్లాప్‌నివ్వగా, సుధాకర్‌రెడ్డి ఎల్బీనగర్ మాజీ ఎమ్‌ఎల్‌ఏ కెమెరా స్విచ్‌ఆన్ చేయగా, స్క్రిప్ట్‌ను జగయ్యయాదవ్, బండారు లక్ష్మణ్‌రెడ్డి అందించగా, మాజీ మేయర్ శ్రీమతి బండ కార్తీక రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు... అనంతరం డైరెక్టర్ కృష్ణకార్తీక్ మాట్లాడుతూ... ఈ చిత్రం ఓపెనింగ్‌కు వచ్చిన పెద్దలందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. ఇంత గొప్పగా ప్రారంభోత్సవం జరుపుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. ప్రయోగాత్మక చిత్రాలనే ఎంకరేజ్ చేస్తున్న ఉదయ్‌గారు మళ్లీ నాకు రెండవ అవకాశాన్ని ఇచ్చినందుకు థాంక్స్. రెగ్యులర్ ఫార్మేట్‌లో కాకుండా రియలిస్టిక్‌గా కథను సినిమాగా రూపొందిస్తున్నాం, చెప్పాలంటే క్యూట్ లవ్‌స్టోరీ, ప్రతి ఒక్కరి మనసును తాకే కథ. రియాలిస్టిక్ సినిమా కనుక నేచురల్ లుక్‌కోసం లోకల్ హీరోను తీసుకోవడం జరిగింది. మన లోకల్ సినిమా కనుక తెలంగాణలోని ప్రతి ప్రాంతంలోనూ షూట్ జరుపుకోనుంది. నెక్స్ట్ వీక్‌లో మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించి 35డేస్‌లో షూట్ కంప్లీట్‌చేసి రెండు నెలల్లో రిలీజ్ ప్లాన్ చేస్తాం అన్నారు.