ప్రయోగాలు చేయను -- మహేష్‌బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘భరత్ అనే నేను’ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. కానీ ఏ ఒక్క పార్టీనిగానీ, మనుషులను గానీ విమర్శించేలా ఉండదు. నా కెరీర్‌లో నన్ను అమితాసక్తిని రేకెత్తించిన చిత్రమిది అని అంటున్నారు మహేష్‌బాబు. ఆయన హీరోగా ‘శ్రీమంతుడు’ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘్భరత్ అనే నేను’. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా మహేష్‌తో ఇంటర్వ్యూ...
* విడుదల దగ్గరపడింది, టెన్షన్‌గా ఉన్నారా?
- సినిమా విడుదలకు ముందే చాలా ఎగ్జైటింగ్‌గా వున్నాను. రాజకీయాలంటే ఏ మాత్రం ఆసక్తి లేని నేను, రాజకీయ నేపథ్యంలో సినిమా చేయడంవల్ల ఈ ఆసక్తి ఏర్పడిందనుకుంటా.
* కథ చెప్పినపుడు ఎలా అనిపించింది?
- కొరటాల శివ నాకు ఈ కథను దాదాపు ఐదు గంటలపాటు చెప్పాడు. ప్రతి సన్నివేశాన్ని వివరించారు. అప్పుడే సినిమా అంటే ఆసక్తి కలిగింది. నా జీవితంలో ఏ సినిమాకూ లేని ఎగ్జైట్‌మెంట్ ఈ సినిమాతో పొందాను.
* ముఖ్యమంత్రి పాత్రకోసం ప్రిపరేషన్ చేశారా?
- లేదు. సినిమా విషయంలో ప్రతిదీ దర్శకుణ్ణి ఫాలో అయ్యాను. సి.ఎం అంటే ఎంత రెస్పాన్సిబుల్ పర్సనో, అతని మాటలు, ప్రవర్తన ఎలా వుంటాయో ప్రతి విషయాన్ని శివ పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసి చెప్పడంవల్ల ఇలా కుదిరింది. అలాగే ఎవరినీ ఇమిటేట్ చేసే అవకాశం కూడా లేకుండా జాగ్రత్తపడ్డాం.
* అసెంబ్లీకి సంబంధించిన సన్నివేశాల్లో ఎలా నటించారు?
- నిజంగా ఈ సినిమా కోసం అసెంబ్లీ సెట్‌ను అద్భుతంగా రూపొందించారు. అందులో షూటింగ్ చేస్తున్నపుడు నిజంగా అసెంబ్లీలోనే ఉన్నామనిపించేది. అప్పుడప్పుడు రిఫరెన్స్ కోసం గల్లా జయదేవ్ వీడియోలు చూసేవాణ్ణి. ప్రతీ విషయంలో శివనే ఫాలో అయ్యాను.
* ఇంతకీ ఈ సినిమా ద్వారా ఏం చెప్పదల్చుకున్నారు?
- ప్రతీ పౌరునికి బాధ్యత అనేది ఉండాలి. ఒక్కసారి మాట ఇచ్చాక దాన్ని నెరవేర్చడానికి ఎంతైనా కష్టపడాలి అనేది ప్రధానంగా చెప్పాలనుకున్నాం. అలాగే కమర్షియల్ హంగులతో చిన్న సందేశం కూడా వుంటుంది.
* ఈ సినిమా చేశాక రాజకీయాలపై ఆసక్తి కలిగిందా?
- లేదు. ఈ సినిమా చేస్తున్నపుడు రాజకీయాలకు సంబంధించిన చాలా విషయాలు తెలుసుకున్నాను. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదు.
* ముఖ్యమంత్రి పాత్ర చేయడం ఎలా అనిపించింది?
- చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యమంత్రి అనేది చాలా బాధ్యతతో కూడుకున్న పదవి. దానిని డిగ్నిఫైడ్‌గా చూపించాలి. ఈ పాత్ర చేసినందుకు ఎగ్జైట్ అవుతున్నా. సినిమా చూశాక మీరు అలా ఫీల్ అవుతారు.
* ఈ సినిమా ఫస్ట్ టీజర్ సంచలనం రేపింది కదా, దీని గురించి?
- ఫస్ట్ రిలీజ్ చేసిన ప్రమాణ స్వీకార వీడియోకి అనూహ్యమైన స్పందన వచ్చింది. చాలామంది అచ్చంగా నాన్నలా ఉన్నారని చెప్పారని అన్నారు. నేను కూడా విని అదే అనుకున్నాను. అలాగే మిగతా టీజర్లకు, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈవిషయంలో సోషల్ మీడియా ఎక్కువ ప్రభావాన్ని చూపించింది.
* ఈ మధ్య మిమ్మల్ని రాజకీయాల్లోకి తేవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది?
- అలాంటిదేం లేదు. బేసికల్‌గా రాజకీయాలంటే నాకు సరిపోవు. పాలిటిక్స్ అనేది మామూలు జాబ్ కాదు. దానికి రెస్పాన్సిబులిటీ ఎక్కువ.
* సినిమా విడుదల ప్రీఫోన్ అవ్వడం మంచిదేనా?
- మంచి సినిమా ఎప్పుడొచ్చినా జనాలు చూస్తారు. ఈ సినిమా విషయంలో నిజానికి ఏప్రిల్ 27న అనుకున్నాం. కానీ నా పేరు సూర్య సినిమా కూడా ఆ రోజే ఉండడంతో నిర్మాతలతో మాట్లాడి ఈ చిత్రాన్ని 20కి మార్చాం. ఆ రోజుకి ఓ స్పెషల్ కూడా వుంది. అదేంటంటే, ఆ రోజే మా అమ్మ పుట్టినరోజు కావడం యాదృచ్ఛికం.
* హైలెట్స్ గురించి?
- హైలెట్స్ గురించి చెప్పాలంటే రెండు రోజులు ఆగితే మీకే తెలుస్తుంది. సినిమా మొత్తం బాగుంటుంది. మ్యూజిక్, కెమెరా, ఆర్ట్.. ప్రతి ఒక్క టెక్నీషియన్ ఎంతో కష్టపడి పనిచేశారు. ‘వచ్చాడయ్య సామి’ పాటను వేరే దగ్గర తీయాల్సింది కానీ అక్కడ కుదరకపోవడంతో కేవలం 15 రోజుల్లో అద్భుతమైన సెట్ వేశారు. మొదటిరోజు షూటింగ్‌కు వెళ్లి నేనే షాక్ అయ్యాను.
* హీరోయిన్ ఖైరా అద్వానీ గురించి?
- ఇది పొలిటికల్ సినిమా కావడంతో స్టార్ హీరోయిన్ అయితే బాగుండదని కొత్త హీరోయిన్‌తో వెళ్దామని దర్శకుడు చెప్పడంతో ఆ దిశగా ఖైరాను ఎంపిక చేశాం. తను చాలా ప్రొఫెషనల్. అద్భుతంగా చేసింది.
* నిర్మాత మీతో సినిమా చేయాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు?
- అవును. 2002 నేను ‘మురారి’ సినిమా చేస్తున్నప్పటినుంచీ ఆయన నాతో సినిమా చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మంచి కథ వుంటే చేద్దామని అనుకున్నాం. అది ఇన్నాళ్లకు కొరటాల శివ ద్వారా తీరింది. నిర్మాత కూడా మంచి పాషన్ వున్న వ్యక్తి.
* సి.ఎంగా నటించారు, ఆ హ్యాంగోవర్ నుంచి బయటికొచ్చారా?
- అందుకే కదా ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లొచ్చాను. ప్రస్తుతం అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు.
* మీకు నచ్చిన బెస్ట్ సి.ఎం ఎవరు?
- ఈ విషయంలో ఎవరి పేరు చెప్పినా అనవసరంగా వివాదాలు తలెత్తుతాయి. అవసరమా?
* మరి త్రివిక్రమ్‌తో సినిమా ఎప్పుడు?
- ఉంటుంది. తను ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. అది అయిపోయాక చూద్దాం.

* వంశీ పైడిపల్లి సినిమా ఎప్పుడు?
- వంశీ సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుంది. తను నా కోసం ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్నందుకు థాంక్స్ చెప్పాలి.
* మళ్లీ సుకుమార్‌తో సినిమా అంటున్నారు?
- సుకుమార్‌తో కూడా సినిమా ఉంటుంది.
* ఎన్టీఆర్ బయోపిక్‌లో మీరు కృష్ణ పాత్ర చేస్తారంటూ వార్తలొస్తున్నాయి?
- ఎన్టీఆర్ బయోపిక్‌లో నాన్నగారి పాత్ర వుందో లేదో తెలియదు. ఈ విషయం గురించి ఎవరూ అడగలేదు.
* మీరు, ఎన్టీఆర్, చరణ్‌లమధ్య మంచి స్నేహబంధం ఉంది కదా! మీ ముగ్గురూ కలిసినపుడు సినిమాల గురించి చర్చిస్తారా?
- సినిమాల గురించి తప్ప ప్రపంచంలో వున్న అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటాం.
* ఈమధ్య జరిగిన ఆడియోలో ఎన్టీఆర్, మీరు ప్రయోగాలు చేయడంలో ఆదర్శమని చెప్పాడు? మీరేమంటారు?
- ఇకపై ప్రయోగాలు చేయను. అలా చేస్తే నాన్న ఇంటికొచ్చి కొట్టేలా ఉన్నాడు.

- శ్రీ