జోరు పెంచింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార. లేడీ సూపర్‌స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ఆమె, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ మరోవైపు స్టార్ హీరోల చిత్రాల్లోనూ గ్లామర్ పాత్రలు పోషిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ సరసన ‘సైరా’ చిత్రంలో నటిస్తున్న నయనతార, మరో రెండు చిత్రాలకు ఓకె చెప్పింది. అందులో తమిళ సూపర్‌స్టార్ అజిత్ సరసన ఓ సినిమా కాగా, మలయాళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడం విశేషం. ఇదివరకే మాయ, డోర వంటి చిత్రాల్లో కీ రోల్ పోషించి సినిమాల విజయంలో కీలక భూమిక పోషించింది. ప్రస్తుతం ఇలాంటి కథలకే ప్రాముఖ్యత ఇస్తున్న నయన, మలయాళంలో చేసే సినిమాకు ‘కొట్టాయం కుర్బానా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మహేష్ వెట్టియార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో అతిథి పాత్రలో కనిపిస్తాడట. మరోవైపు అజిత్ ‘విశ్వాసం’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈమెకు పలు తెలుగు తమిళ అవకాశాలు క్యూ కట్టాయి.