మహేష్ సపోర్ట్‌వల్లే సాధ్యమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించిన భరత్ అనే నేను’ చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధమైన సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో పాటల రచయిత రామజోగయ్య శాస్ర్తీ మాట్లాడుతూ- నిజాయితీతో కూడిన ఒక అద్భుతమిది. కొరటాల శివతో మొదటినుంచీ ప్రయాణం చేస్తున్నాను. ఆయన ఆలోచనలు, సినిమా తీసే విధానం గొప్పగా వుంటుంది. ఈ సినిమాలో మహేష్ నటన అద్భుతం. చాలా గౌరవంతో కూడిన సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చేలా వుండడమే కాకుండా ఆలోచింపచేసేలా వుంటుంది. మహేష్ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చుతుంది. దేవిశ్రీ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. పాటలన్నీ ఘనవిజయం సాధించడంతో ఆనందంగా వుంది అన్నారు. నిర్మాత దానయ్య మాట్లాడుతూ- మా బ్యానర్‌లో ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా వుంది. అది కొరటాల శివవల్ల అవకాశం రావడం మర్చిపోలేని అనుభూతి. ఆయనకు జీవితాంతం రుణపడి వుంటాను. అందరూ గర్వంగా చెప్పుకునే సినిమా తీశానని అంటారు. మహేష్‌తో సినిమా చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరినందుకు ఆనందంగా వుంది. ఈసినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అన్నారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ- సినిమాకు ఇంత హైప్ రావడం ఆనందంగా వుంది. ఈ విషయంలో ప్రతిఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పెద్ద కాన్వాస్ వున్న సినిమాకి అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా ఈ కథను ఏడాది క్రితం రాసుకున్నాను. కథను వినగానే మహేష్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించి చేద్దామన్నాడు. సినిమా విషయంలో ఆయన ఇచ్చిన సపోర్టువల్లే ఇంత త్వరగా పూర్తిచేశాం. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. కమర్షియల్ అంశాలు ఉంటూనే పొలిటికల్ నేపథ్యంలో వుంటుంది. దేవి సంగీతం, రామజోగయ్య పాటలు, రవి కె.చంద్రన్, తిరు ఫొటోగ్రఫి సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ముఖ్యంగా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ వేసిన సెట్లు అద్భుతంగా వుంటాయి. ఈ చిత్రాన్ని దానయ్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. టాలీవుడ్‌లో బెస్ట్ ప్రొడ్యూసర్లలో ఒకరు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అన్నారు.