టీజర్‌లో టాక్సీవాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ, మాళవికా నాయర్ జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో జి.ఎ 2, యువి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘టాక్సీవాలా’. ఎస్.కె.ఎన్ నిర్మాత. ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. టీజర్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు. అనంతరం దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ- ది ఎండ్ తరువాత నేను చేస్తున్న రెండో చిత్రమిది. ఇంత పెద్ద బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా వుంది. ముఖ్యంగా అర్జున్‌రెడ్డి సినిమా తరువాత విజయ్ దేవరకొండతో పనిచేసే అవకాశం రావడం మర్చిపోలేని అనుభూతి. ఎక్కడా తగ్గకుండా సినిమాను పూర్తిచేశాం. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయని అన్నారు. మాళవికా నాయర్ మాట్లాడుతూ- నాకు బాగా నచ్చిన పాత్ర ఇది. దాని గురించి ఇప్పుడే చెప్పలేను అన్నారు. నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ- గీతా ఆర్ట్స్, యు.వి క్రియేషన్‌ల బ్యానర్‌లో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి అల్లు అరవింద్ సపోర్టు అందించారు. బన్నీ వాసు, నాకు నిర్మాతగా వుండడానికి అవకాశం కల్పించారు. టాక్సీవాలా ఓ భిన్నమైన సినిమా. విజయ్ అద్భుతంగా నటించారు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ- ఈ సినిమా నాకు ఒక కొత్త అనుభూతి. విజయ్ కథ విని ఎగ్జైట్ అయ్యాడు. తను యూత్ ఐకాన్‌లా ఉన్నాడు. రాహుల్ అద్భుతంగా తెరకెక్కించాడు. విజయ్‌కు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. తను కూడా నా కొడుకులతో సమానం. ఈ చిత్రం ద్వారా ప్రియాంక అనే తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నాం. తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి లాంటి సినిమా వచ్చిన తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తున్నాయి అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ- ఈ సినిమా పోస్టర్‌పై ప్రతిష్ఠాత్మక బ్యానర్‌లైన గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ ఉండడం గర్వంగా వుంది.