పోరాటాలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సొట్టబుగ్గల తాప్సీకి ఎన్ని సినిమాల్లో నటించినా కూడా సరైన కమర్షియల్ గుర్తింపు దక్కలేదు. అయితే అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఈమధ్యే బాలీవుడ్‌లో కూడా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ తన తదుపరి చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చేయడానికి సిద్ధపడుతోంది. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్‌కే పరిమితం కాదని, అన్నీ చేయాలని చెబుతోంది. ఈమధ్యే వచ్చిన లారెన్స్ ‘గంగ’ చిత్రంతో నటిగా కూడా మంచి గుర్తింపే తెచ్చుకుంది. తాజాగా బాలీవుడ్‌లో మరో అవకాశాన్ని దక్కించుకుంది. అక్షయ్‌కుమార్ హీరోగా అప్పట్లో వచ్చిన ‘తుంబిన్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందే సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది తాప్సి. ఇందులో అక్షయ్‌తోపాటు తాప్సీ కూడా ఫైట్స్ చేస్తుందట. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలే అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన బేబి సినిమాలో కూడా యాక్షన్ సన్నివేశాల్లో నటించి ఔరా అనిపించింది తాప్సీ.