ప్రభాస్ జోడిగా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రం దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు వుంటారని ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో హీరోయిన్ కూడా ఎంపిక చేశారట. అయితే ఈసారి ప్రభాస్ సరసన హీరోయిన్‌గా అవకాశం కొట్టేసింది మరో బాలీవుడ్ భామ కావడం విశేషం. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టిన ఎవలిన్ శర్మ. ఇపుడిప్పుడే సక్సెస్ వైపు అడుగులు వేస్తున్న ఎవలిన్, ప్రభాస్ సరసన అవకాశం పట్టేయడంతో ఆమె కెరీర్ టర్న్ అవుతుందని బి టౌన్ మీడియా భావిస్తోంది. సాహో చిత్రం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. మొత్తానికి ఎవలిన్ లక్కీ గాళ్ అని చెప్పాలి.

చిత్రం..ఎవలిన్ శర్మ.