ఇక నిర్మాతగా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య కొందరు హీరోయిన్స్ కేవలం సినిమాల్లో హీరోపక్కన నటించడమే కాకుండా నిర్మాతగా అడుగులేస్తూ సత్తాచాటుకుంటున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ భామలు ముందు వరసలో ఉన్నారు. తాజాగా సౌత్‌లో వాళ్ళను ఫాలోఅవుతున్న హీరోయిన్స్ కూడా పెరుగుతున్నారు. ఇప్పటికే క్రేజీ భామ సమంత కూడా నిర్మాతగా మారింది. ఇప్పుడు మరో మాజీ హీరోయిన్ కూడా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అని షాక్ అవుతున్నారా? ఆమె ఎవరో కాదు సదా. 2000 దశకంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమధ్య వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న సదాకు తాజాగా ఓ మంచి అవకాశం దక్కింది. టార్చిలైట్ పేరుతో తెరకెక్కే సినిమాలో వేశ్య పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాతో సదా మళ్ళీ తెర కెరీర్ గాడిలో పడుతుందనే నమ్మకంతో ఉంది. టార్చిలైట్ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు మజీద్‌తో తాను ఓ సినిమా నిర్మిస్తానని చెప్పిందట. సో నిర్మాతగా కూడా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టేందుకు రెడీ అయింది సదా!!