1980 నేపథ్యంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా మళ్లీ వెనక్కి వెళుతుంది.. 1980 నేపథ్యంలో.. అంతకుముందుతరం సినిమాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా సంచలన విజయం అందుకున్న ‘రంగస్థలం’ సినిమా కూడా 80 నేపథ్యంలో రూపొందింది కావడం విశేషం. తాజాగా ప్రేక్షకులు భిన్నత్వం ఫీలవ్వగల కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం తన 28వ సినిమాను సుధీర్‌వర్మ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. తాజా సమాచారంమేరకు ఈ సినిమాలో 1980ల బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వార్త నిజమోకాదో అనేది మాత్రం ఇంకా ఖచ్చితంగా తెలియాల్సిఉంది. కళ్యాణిప్రియదర్శిని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీతోపాటు శర్వానంద్ హనురాఘవపూడి దర్శకత్వంలో కూడ ఒక సినిమా చేస్తున్నాడు.