వై.ఎస్ బయోపిక్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వై .ఎస్.రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు మహి వి.రాఘవ్ సన్నాహాలు చేస్తున్నాడు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్ర ఆ యాత్ర చూపిన ప్రభావం, ఆయనకి విజయాన్ని అందించిన తీరు ఈ సినిమాలో చూపించనున్నారట. అందువలన ఈ సినిమాకి ‘యాత్ర’ అనే టైటిల్‌ను ఖరారుచేశారు. ఈ సినిమాలో ముఖ్యమైన రాజశేఖర్‌రెడ్డిగారి పాత్రకి రాజశేఖర మలయాళ స్టార్ హీరో మమ్ముట్టిని ఎంపిక చేసుకున్నారు. ఆయన సతీమణి విజయమ్మ పాత్రలో నయనతారను ఎంపిక చేసుకోనున్నట్టుగా మొదట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు విజయమ్మ పాత్రకి రమ్యకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి, ఆమెను తీసుకున్నట్టుగా చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో వై.ఎస్.జగన్ పాత్రలో తమిళ స్టార్ హీరో సూర్య చేయనున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం.