పవన్‌కళ్యాణ్ నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఫిలిం ఛాంబర్ వద్ద నిరసన తెలిపారు. పవన్‌తోపాటు ఆయన తల్లి, ఆయన సోదరుడు నాగబాబు, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ శుక్రవారం ఫిలిం ఛాంబర్‌వద్దకు చేరుకున్నారు. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ‘మా’ అసోసియేషన్, నిర్మాతల మండలిని పవన్ ప్రశ్నించారు. శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక తానున్నానని రామ్‌గోపాల్‌వర్మ ప్రకటించడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించారు. తనకు న్యాయం జరిగే వరకు ఫిలిం ఛాంబర్ వదిలివెళ్లేది లేదని పవన్ స్పష్టం చేశారు. మరోవైపు వర్మపై న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చన్న అంశంపై అల్లు అరవింద్, పవన్‌కళ్యాణ్ న్యాయవాదులతో చర్చించారు. తన తల్లిపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండించకుండా గంటలపాటు చర్చలుపెట్టి టీఆర్పీ రేటింగులకోసం కొన్ని ఛానళ్లు పాకులాడుతున్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక తానున్నానని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ప్రకటించడంపై మెగా కుటుంబం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ వివాదంలో తనను అనవసరంగా లాగడం, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. ‘నాపై ఆరోపణలు చేస్తున్న వారికి, చేయిస్తున్న వారికి అమ్మలు, అక్కలు, కోడళ్లు ఉన్నారు. కానీ వారి ఇంట్లో మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. టీఆర్‌పీలు, రాజకీయ లాభాలకోసం వయసైపోతున్న నా 70 ఏళ్ల తల్లిని దూషిస్తున్నారు. మీరంతా టీఆర్‌పీలకోసం షోలు నిర్వహిస్తున్నారు కదా? మంచిది. వీటన్నింటికంటే మించిన షోను మీకు చూపిస్తాను. నేను నటుడికంటే ముందు, రాజకీయనేత కంటే ముందు ఓ అమ్మకు బిడ్డను. ఓ కొడుకుగా నా తల్లి గౌరవాన్ని కాపాడుకోలేకపోతే బతకడం కంటే చావడం మంచిది’ అంటూ పవన్ చేసిన ట్వీట్ ఆయన మనోవేదనను తెలియజేస్తోంది. పవన్ ఫిలిం ఛాంబర్‌కు వచ్చారని తెలుసుకున్న అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో వారిని అదుపుచేయడం పోలీసులకు కష్టంగా మారింది. అభిమారులు వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అభిమానులను అదుపు చేయడం కష్టంగా మారిందని పోలీసులు సూచించడంతో పవన్‌కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వర్మపై సినీ పరిశ్రమలోని పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో రేపటి వరకూ వేచి చూస్తానని, ఆ తర్వాత తన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పినట్లు తెలిసింది. పవన్‌కళ్యాణ్‌కు మద్దతుగా నిర్మాత అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, సాయి ధరమ్‌తేజ్, శివబాలాజీ, హేమ, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, దర్శకుడు వి.వి.వినాయక్, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, నరేశ్ తదితరులు ఫిలించాంబర్‌కు చేరుకుని సంఘీభావం తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా పవన్‌కు మద్దతు ప్రకటించారు.